Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంటి చూపును కాపాడే ఆహారాలు ఇవి..!

Weak Eyesight Eat These 5 Foods To Improve Your Vision
Advertisement
  • చేపలు, కోడిగుడ్లు మంచివి
  • క్యారెట్లు, పాలకూర, బాదం గింజలు తీసుకోవచ్చు
  • వీటిల్లో కంటిని కాపాడే ఇంగ్రెడియంట్లు
Advertisement
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మన శరీరంలో కళ్లకు ప్రాధాన్యం ఎంతో ఉంటుంది. కావాల్సిన పోషకాలు అందేలా చూసుకుంటే చాలు.. కంటి చూపును జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అలాగే, కంటి నరాలపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మధుమేహం, బీపీ ఉన్న వారు వాటిని నియంత్రణలో పెట్టుకుని, పోషకాహారం అందించడం ద్వారా కంటిచూపు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. పోషకాలంటే విటమిన్ ఏ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందించాలి.

కంటి చూపు ఎందుకు తగ్గుతుంది? అనే దానికి వయసు పెరగడం ఒక కారణం. ఫోన్లు, కంప్యూటర్ల స్క్రీన్లను గంటల తరబడి చూస్తుంటే కంటికి విశ్రాంతి తగ్గి, నష్టం జరుగుతుంది. ఇవి కాకుండా ఒత్తిడి, పోషకాల లేమితోనూ కంటి చూపు మసకబారుతుంది. 

చేపలు
కంటికి చేపలు ఎంతో మంచి చేస్తాయి. చేపల్లోనూ సాల్మన్ రకం మంచివి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. కనుక ఇవి చెడు కొవ్వులను తగ్గిస్తాయి. కళ్లు పొడిబారిపోకుండా, రెటీనాకు మేలు చేస్తాయి.

బాదం గింజలు
ఆల్మండ్స్ లో విటమిన్ ఈ తగినంత ఉంటుంది. ఇది కంటికి రక్షణనిస్తుంది. వయసు మీరడం వల్ల వచ్చే మాక్యులర్ డీజనరేషన్ నుంచి కాపాడుతుంది. అయితే, రోజులో బాదం గింజలను ఎక్కువ కాకుండా తీసుకోవాలి. అంటే ఒకేసారి మితిమీరి తినకూడదు.

గుడ్లు
కోడి గుడ్లలో విటమన్ ఏ, లూటిన్, జియాక్సాంతిన్, జింక్ ఉంటాయి. విటమిన్ ఏ కంటి కార్నియాకు ఎంతో అవసరం. కంటిలో కనిపించే ఉపరితలాన్ని కార్నియాగా పేర్కొంటారు. లూటిన్, జియాక్సాంతిన్ కంటికి సమస్యలు రాకుండా రక్షణనిస్తాయి. రెటీనా ఆరోగ్యానికి జింక్ సాయపడుతుంది. లూటిన్, జియాక్సాంతిన్ ను మన శరీరం తయారు చేసుకోలేదు. పాలకూరలోనూ ఇవి లభిస్తాయి. 

క్యారెట్లు
క్యారెట్లలోనూ విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. పైన చెప్పుకున్న ప్రయోజనాలకు అదనంగా, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా విటమిన్ ఏ రక్షణనిస్తుంది.
Advertisement
Advertisement
Eyesight
vision
improvement
foods
nutrition

More Telugu News